
పడిగాపులు.. ఆందోళనలు
గన్నేరువరం/శంకరపట్నం/రామడుగు: జిల్లాలో యూరియా కష్టాలు తప్పడం లేదు. రైతులు గోదా ముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఓపిక నశించి ఆందోళనకు దిగుతున్నారు. గన్నేరువరం మండలంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. గన్నేరువరం మండలంతో పాటు తిమ్మాపూర్ మండలం, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన రైతులు గుండ్లపల్లి స్టేజీ వద్ద ఉన్న డీసీఎంఎస్‌కు శుక్రవారం ఉదయం వచ్చారు. యూరియా లేకపోవడంతో సాయంత్రం వరకు ఎదురుచూశారు. అయినా రాకపోవడంతో విసుగుచెంది రాజీవ్ రహదారిపై ఆందోళనకు దిగారు. యూరియా కష్టాలను పట్టించుకోవడం లేదని ధర్నా చేశారు. ట్రాఫిక్ జామ్ కావడంతో స్థానిక పోలీసులతో పాటు సిద్దిపేట సీఐ రైతులను శాంతింపజేశారు. శంకరపట్నం మండలం కేశవపట్నంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణానికి లోడ్ యూరియా రావడంతో శుక్రవారం మధ్యాహ్నం 100మంది రైతులు అక్కడికి చేరుకున్నారు. రైతులకు పంపిణీ చేయకపోవడంతో మూడు గంటలు పడిగాపులు కాశారు. సాయంత్రం ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున అందించారు. రామడుగు మండలం గోపాల్‌రావుపేట రైతునేస్తం ఎరువుల కేంద్రానికి 420 బస్తాలు రావడంతో రైతులు భారీ చేరుకున్నారు. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు.

పడిగాపులు.. ఆందోళనలు

పడిగాపులు.. ఆందోళనలు