
ట్రెసా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి
కరీంనగర్ అర్బన్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) జిల్లా అధ్యక్షుడిగా నల్ల వెంకట్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రెసా జిల్లా కమిటీ ఎన్నికలు మంగళవారం రెవెన్యూ భవన్‌లో నిర్వహించారు. 2025–28 సంవత్సరానికి గానూ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నల్ల వెంకట్‌రెడ్డి(జమ్మికుంట తహసీల్దార్), ప్రధాన కార్యదర్శిగా పెద్ది విజయ్‌కుమార్(నాయబ్ తహసీల్దార్), కోశాధికారిగా ఇ.సంతోష్‌కుమార్(గిర్దావర్), అసో సియేట్ అధ్యక్షులుగా కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్, ఎన్.రాజేష్(తహసీల్దార్, కరీంనగర్ రూరల్), ఉపాధ్యక్షులుగా ముబీన్ అహ్మద్, మాధవి, విశాలి, కమ్రుద్దీన్, సురేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా షరీఫ్, సుమలత, త్రిపాల్, లక్ష్మారెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా శంకర్, సందీప్, ఉష, రంజిత్‌రెడ్డి, అంజయ్య, స్పోర్ట్స్, కల్చరల్ సెక్రటరీలుగా బషీర్, భవాని, జిల్లా కమిటీ మెంబర్లుగా అన్వర్, కమలేశ్, అరుణ్, శంకర్, బాలకిషన్, అజహర్, కిషన్‌రెడ్డి, అనిల్, అనిల్‌కుమార్, రాజలింగం, అశోక్, సంపత్, కొమురయ్య నియామకం అయ్యారని ఎన్నికల అధికారి (ట్రెసా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు) రాజ్‌కుమార్ వివరించారు.
యూరియా కోసం ధర్నా
గంగాధర: గంగాధర మండలం కురిక్యాల ప్రాథమిక సహకార సంఘం పరిధిలోని కురిక్యాల, ఉప్పరమల్యాల, గట్టుభూత్కూర్, హిమ్మత్‌నగర్, గోపాల్‌రావుపల్లి, మల్లాపూర్ గ్రామాల రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మంగళవారం యూరియా కోసం వచ్చిన రైతులు విసిగిపోయి కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఎస్సై వంశీకృష్ణ కురిక్యాలకు చేరుకొని రైతులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. అధికారులు వచ్చి రైతులకు కూపన్లు ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.
లారీ అడ్డగింత
గన్నేరువరం: యూరియా బస్తాలతో వెళ్తున్న లారీని జంగపల్లి ఎక్స్‌రోడ్డులో హన్మాజీపల్లి, గోపాల్‌పూర్ రైతులు అడ్డుకున్నారు. జంగపల్లి ఎక్స్‌రోడ్‌లోని సహకార సంఘం షాపు వద్ద వంద బస్తాలు అన్‌లోడ్ చేసిన తరువాత లారీ జంగపల్లి వెళ్తోంది. లారీలో మరో 300బస్తాలు ఉండగా వాటిని కూడా ఇక్కడే అన్‌లోడ్ చేయాలని రైతులు అడ్డుకున్నారు. ఎస్సై నరేందర్‌రెడ్డి అక్కడికి చేరుకొని ఏవో కిరణ్మయికి ఫోన్లో సమస్యను వివరించారు. రైతులతో మాట్లాడి లారీని అక్కడి నుంచి పంపించారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులతో పాటు లైన్ మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.కాపువాడ ఫీడర్ పరిధిలోని అహ్మద్‌పుర, గౌరీశంకర్ కాంప్లెక్స్, అశోక్‌నగర్, ఎన్‌ఎన్ గార్డెన్, మీరా ఆసుపత్రి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్– 1 ఏడీఈ పంజాల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా విద్యుత్ లైన్ల పనులు, మధ్య స్తంభాల ఏర్పాటు పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొత్తపల్లి, తూర్పువాడలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.