
● నిధులు ‘నిమజ్జనం’
కరీంనగర్ కార్పొరేషన్: వినాయక నిమజ్జనం సందర్భంగా నగరవ్యాప్తంగా చేపడుతున్న పనులు అభా సుపాలవుతున్నాయి. గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా, రోడ్లపై గుంతలను పూడ్చే పనులను సంబంధిత కాంట్రాక్టర్లు మంగళవారం నుంచి ప్రారంభించారు. నగరపాలకసంస్థ రూ.59.93 లక్షలతో 24 పనులకు టెండర్ పిలవడం తెలిసిందే. కేవలం రోడ్లపై గుంతలు పూడ్చేందుకు సుమారు రూ.24 లక్షలు కేటాయించారు. ఈ సివిల్ వర్క్స్ పొందిన కాంట్రాక్టర్లు నగరంలోని ఆయా డివిజన్లలో పనులు మొదలు పెట్టారు. కొంతమంది కాంట్రాక్టర్లు ౖపైపెనే పనులు చేస్తూ, బిల్లులు ఎత్తుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అశోక్‌నగర్‌లోని గుంతల్లో స్టోన్‌చిప్స్ నింపి గంటలు గడవకముందే గుంతలు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. నిమజ్జనం జరిగేందుకు మరో రెండు రోజులు గడువు ఉండగా, ఆ లోగా రోడ్డు గుంతలతో మళ్లీ మామూలు స్థితికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నగరపాలకసంస్థ అధికారులు ౖపైపె పనులు కాకుండా, వినాయక విగ్రహాల వాహనాలు సాఫీగా వెళ్లే విధంగా రోడ్లను చదును చేయాల్సిన అవసరం ఉందని నగర ప్రజలు కోరుతున్నారు.