
● జోహార్ వైఎస్సార్
కరీంనగర్ కార్పొరేషన్: తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. మంగళవారం వైఎస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. డీసీసీ కార్యాలయంలో సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి వైఎస్సార్ చిత్రపటానికి నివాళి అర్పించారు. పులి ఆంజనేయులుగౌడ్, శ్రవణ్‌నాయక్, కొరివి అరుణ్‌కుమార్, వెన్న రాజమల్లయ్య, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, కల్వ లామ చందర్, మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు. నగరంలోని వృద్ధులు, వికలాంగుల వసతిగృహంలో పీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్ కట్ల సతీశ్, వీర దేవేందర్ పటేల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు ఆధ్వర్యంలో ప్రజాకార్యాలయంలో వైఎస్‌ఆర్ చిత్రపటానికి నివాళి అర్పించారు.