
చదవాలి.. క్రీడల్లో మెరవాలి
కరీంనగర్‌స్పోర్ట్స్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా కరీంనగర్ ప్రాంతీయ క్రీడాపాఠశాలలో హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి సీపీ గౌస్‌ఆలంతో కలిసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చదువు ఎంత అవసరమో క్రీడలు అంతే ఉపయోగమన్నారు. క్రీడా పాఠశాలలోని సదుపాయాలను సద్వినియో గం చేసుకొని, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. సీపీ గౌస్‌ఆలం మా ట్లాడుతూ హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ మాట్లాడుతూ కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలకు ప్రత్యేకంగా నిధులు వెచ్చించి సదుపాయాలు కల్పించామన్నారు. వివిధ క్రీడాపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ ప్రదా నం చేశారు. డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి లక్ష్మణ్‌రావు, ఎస్జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్, క్రీడా పాఠశాల హెచ్‌ఎవ శ్రీనివాస్ పాల్గొన్నారు.
తల్లి చదువుకుంటే పిల్లలు ఉన్నత విద్యావంతులు అవుతారు
శంకరపట్నం: తల్లి చదువుకుంటే పిల్లలు ఉన్న విద్యావంతులవుతారని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శంకరపట్నం మండలం వంకాయగూడెం అంగన్‌వాడీకేంద్రంలో నిర్వహించిన శుక్రవారం సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. మహిళలు ప్రతీ ఆరునెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవా లని సూచించారు. చదువుకోని మహిళలను ఓపెన్‌టెన్త్‌లో చేర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయిన అనూషను చీరతో సత్కరించారు. సీడీపీవో శ్రీమతి, డీఎంహెచ్‌వో వెంకటరమణ, తహసీల్దార్ సురేఖ, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, ఎంపీవో ప్రభాకర్ పాల్గొన్నారు.