నగరంలోని వాడవాడల్లో కొలువుదీరిన గణనాథులు మూడోరోజు శుక్రవారం ఘనమైన పూజలందుకున్నారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విభిన్న గణపతులు ప్రజలను ఆకట్టుకుంటుండగా.. ప్రత్యేకంగా వెళ్లి దర్శించుకుంటున్నారు. నగరంలోని రామగుండం బైపాస్‌లో ఐసో టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పైలెట్ గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. పడవ చౌరస్తాలో ఫ్రెండ్స్‌యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు ఆకట్టుకుంటున్నాడు. పాతబజార్ 1/బీలో అశ్వవాహనంపై విన్నర్స్ యూత్ ఏర్పాటు చేసిన గణేశుడు విభిన్నంగా ఉండగా.. పాతబజార్‌లో గోల్డెన్ యూత్ 1/ఏ ఏర్పాటు చేసిన సప్త చిరంజీవుల విఘ్నేశ్వరుడు చూడముచ్చట గొల్పుతున్నాడు. గాంధీ చౌరస్తాలో గాంధీ చౌక్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన రాధా శ్రీకృష్ణ రూపంలోని వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. విద్యానగర్‌లోని వాణినగర్‌లో గుహలో గణనాథుడు ఘనమైన పూజలందుకుంటున్నాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్
విభిన్నరూప విఘ్నేశ్వర
విభిన్నరూప విఘ్నేశ్వర
విభిన్నరూప విఘ్నేశ్వర
విభిన్నరూప విఘ్నేశ్వర