
ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి
కరీంనగర్: జిల్లాలో వంద పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గీట్ల ముకుందరెడ్డి, ఎడ్ల రమేశ్ మాట్లాడుతూ జిల్లాలో వేలాదిమంది ఈఎస్‌ఐ చందాదారులు ఉన్నప్పటికీ జిల్లాకేంద్రంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి లేకపోవడంతో వైద్య సౌకర్యం పొందడం లేదన్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో వేల రూపాయలు బిల్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఈఎస్‌ఐ చందాదారుకు సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందించడానికి కార్పొరేట్ ఆసుపత్రులతో టైఅఫ్ చేశారన్నారు. కరీంనగర్‌లో ఒకటి కూడా ఎంపానల్డ్ హాస్పిటల్ లేకపోవడం బాధాకరమన్నారు. అనంతరం డీఆర్‌వో వి.వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయు జిల్లా కోశాధికారి జి రాజేశం, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జనగాం రాజమల్లు, జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్, నాయకులు తిరుమలయ్య, కాంపెల్లి పోచయ్య, రాజమల్లయ్య, అంజయ్య, దేవేందర్, నరేశ్, రాజేందర్, సంపత్ పాల్గొన్నారు.