బీఆర్‌ఎస్ తప్పులే కాంగ్రెస్ కొనసాగించింది
గతంలో బీఆర్‌ఎస్ చేసిన తప్పులనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం డివిజన్‌ల పునర్విభజన కొనసాగించింది. కాంగ్రెస్, ఎంఐఎం మెజార్టీ స్థానాలు దక్కించుకొనేలా డీలిమిటేషన్‌ను అశాసీ్త్రయంగా చేపట్టారు. డివిజన్‌లలో పేర్కొన్న ఇండ్లు, అందులో ఓట్లకు సంబంధం లేకుండా పోయాయి. క్షేత్రస్థాయిలో మ్యాప్ పరంగా, నిబంధనలకు అనుగుణంగా చేయాల్సిన డీలిమిటేషన్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తప్పుదోవ పట్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. నిబంధనల ప్రకారం శాసీ్త్రయంగా డీలిమిటేషన్‌ను తిరిగి చేపట్టాలి. – గుగ్గిళ్లపు రమేశ్,
మాజీ డిప్యూటీ మేయర్, బీజేపీ నేత


