పార్కింగ్ పరేషాన్
జమ్మికుంట: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే వాణిజ్య, వ్యాపార ప్రాంతంగా జమ్మికుంట పట్టణం అ భివృద్ధి చెందుతోంది. రోడ్డు, రైలుమార్గం ఉండడంతో నిత్యం వేలాదిమంది ఇతర ప్రాంతాల వారు వచ్చిపోతుంటారు. పట్టణం విస్తరిస్తుండడంతో పా టు జనాభా, వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఫలి తంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ప్రధానంగా ఆర్వోబీ ప్రాంతంలో ఈ సమస్య తీవ్రంగా ఉంటోంది. నిబంధనల ప్రకారం.. ఆర్వోబీ కింది ప్రాంతా న్ని వాహనాల పార్కింగ్ కోసం కేటాయించారు. అ యితే కొందరు పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించుకుని, వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో వాహనదారులు రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. ఫలితంగా రోడ్డు ఇరుకుగా మారి ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది.
తీవ్ర ట్రాఫిక్ సమస్య
జమ్మికుంట పట్టణం నడిబొడ్డున ఆర్వోబీ నిర్మించారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడొద్దనే ఉద్దేశంతో బ్రిడ్జి కింది ప్రాంతాన్ని వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు. కానీ కొందరు వ్యాపారులు ఆ ప్రాంతాన్ని ఆక్రమించారు. ఎలాంటి అనుమతి లేకుండా సామగ్రి పెడుతున్నారు. షెడ్లు వేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. కొందరు బ్రిడ్జి కింది ప్రాంతాన్ని ఆక్రమించుకుని, చిరువ్యాపారులకు అద్దెకు ఇస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. పట్టణానికి పనుల నిమిత్తం వచ్చేవాహనదారులు రోడ్డుపైనే వాహనాలు నిలుపుతున్నారు. మున్సిపల్, పోలీస్ అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో సమస్య జఠిలమవుతోంది. అనుమతి లేకుండా నిర్మించిన షెడ్లతో మున్సిపల్‌కు రూపాయి ఆదాయం రాకపోగా.. ట్రాఫిక్ సమస్యపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణకు గురైన స్థలాలపై చర్యలు తీసుకొని, పట్టణంలో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని జమ్మికుంట వాసులు కోరుతున్నారు.
జమ్మికుంటలో ట్రాఫిక్ కష్టాలు
రోడ్డు, ఆర్వోబీని ఆక్రమించిన వ్యాపారులు
చిరు వ్యాపారాలకు నిలయంగా పార్కింగ్ స్థలం
విస్తరణ మార్కింగ్, ఆక్రమణపై చర్యలు శున్యం
పార్కింగ్ పరేషాన్
పార్కింగ్ పరేషాన్


