పొరపాట్ల సవరణకు అవకాశం
చొప్పదండి: భూభారతి చట్టంతో పాసు పుస్తకాల్లో పొరపాట్ల సవరణకు అవకాశం ఉంటుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంపై బుధవారం పట్టణంలోని జీఆర్‌ఆర్‌ఆర్ గార్డెన్‌లో అవగాహన సదస్సు నిర్వహించగా, కలెక్టర్ హాజరై మాట్లాడారు. ధరణి పోర్టల్‌లో లేని అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ పథకం అమలు చేస్తున్నారని, తదుపరి భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆధారాలతో దరఖాస్తు చేస్తే పాసు పుస్తకాల్లోని తప్పులను సవరిస్తామని తెలిపారు. గతంలో కలెక్టర్ వద్దకు సమస్యలు రావడంతో వే సంఖ్యలో ఉండి పరిష్కారం కాలేదని, ఇప్పుడు తహసీల్దార్ స్థాయి అధికారులకు కూడా అధికారాలు ఇవ్వడంతో సత్వరం పరిష్కారం అవుతాయని తెలిపారు. ఆర్‌డీవో మహేశ్వర్, తహసీల్దార్ నవీన్ కుమార్, ఏఎంసీ చైర్మన్ కొత్తూరి మహేశ్, ప్రియదర్శిని, తిరుపతిరావు, ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఏవో వంశీకృష్ణ, పాల్గొన్నారు.
వర్క్‌సైట్ స్కూల్ సందర్శన
మండలంలోని గుమ్లాపూర్ గ్రామంలో ఇటుక బట్టీ కార్మికుల పిల్లలకు నిర్వహిస్తున్న వర్క్‌సైట్ స్కూల్‌ను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, యూనిఫాం, ఒరియా పుస్తకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధనపై సంతోషం వ్యక్తం చేశారు. మే నెలలో కూడా పాఠశాల నడపాలని సూచించారు. ఎంఈవో శ్రీనివాస్ దీక్షిత్, హెచ్‌ఎం వీరేశం, శ్రీనివాస్, రమేశ్ పాల్గొన్నారు.
కలెక్టర్ పమేలా సత్పతి
భూ భారతిపై చొప్పదండిలో అవగాహన


