కొత్తపల్లి: ప్రముఖ పోటీ పరీక్షల సంస్థ సిల్వర్ జోన్ ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన జోనల్‌స్థాయి స్మా ర్ట్‌కిడ్స్ జీకే ఒలింపియాడ్‌లో కొత్తపల్లిలోని అల్ఫో ర్స్ ఇ టెక్నో స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జోనల్‌స్థాయిలో పతకాలు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి తెలి పారు. పాఠశాలకు చెందిన వి.ఆశ్రిత రెడ్డి (4వ తరగతి), సి.హెచ్.సోహన్, పి.మయాంక్ రెడ్డి (5వ), సాగి శ్రీదాత్రి, యు.రితేష్ (6వ), ఇ.లిఖిత్ కుమార్ (8వ), ఇ.రాజ్ ఆరుష్ పటేల్, కె.తనీష్ రెడ్డి, కె.రిషి క్ (10వ)లు జోనల్ స్థాయిలో మెడల్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కై వసం చేసుకున్నట్లు తెలిపారు. పాఠశాలలో మంగళవారం విద్యార్థులను అభినందించారు.
అలరించిన అల్ఫోర్స్ ‘బ్లూసూమ్’ వేడుకలు
కిసాన్‌నగర్‌లోని అల్ఫోర్స్ హైస్కూల్ వార్షిక వేడుకలు అలరించాయి. స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం అల్ఫోర్స్ బ్లూసూమ్ పేరిట నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్‌తో కలిసి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. పాఠశాల వార్షిక ప్రణాళికలో భాగంగా వివిధ క్రీడలు, పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఒలింపియాడ్‌లో అల్ఫోర్స్ విద్యార్థుల ప్రతిభ