వేములవాడ: రాజన్న ఆలయంలో ఈనెల 16 నుంచి 20 వరకు ఐదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రధానాలయం ఎదుట ప్రత్యేక యాగశాల ఏర్పాటు చేశారు. రంగురంగుల విద్యుత్‌దీపాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. 17న పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం చైర్మన్ చాంబర్ ఎదుట ప్రత్యేక వేదికపై నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 19న సాయంత్రం ఐదు గంటలకు ఉత్సవమూర్తుల రథోత్సవం, 20న అవబృత స్నానం, త్రిశూలయాత్ర, పూర్ణాహుతి, ఏకాదశవరణములతో ఉత్సవాలు సమాప్తమవుతాయని వారు తెలిపారు.
సందడి చేయనున్న హిజ్రాలు.. శివపార్వతులు
రాజన్న కల్యాణంలో వివిధ రాష్ట్రాలకు చెందిన హిజ్రాలు, వివిధ ప్రాంతాలకు చెందిన శివపార్వతులు, జోగినులు వేములవాడకు చేరుకుని ఐదు రోజులపాటు సందడి చేయనున్నారు. రాజన్నను వివాహమాడతారు. అనంతరం రథోత్సవంలో పాల్గొంటారు. బద్దిపోచమ్మకు పెద్ద ఎత్తున బోనాలు సర్పించుకుంటారు.
రేపు పార్వతీరాజరాజేశ్వరుల కల్యాణం
19న రథోత్సవం
20న త్రిశూలయాత్ర


