బీఆర్‌ఎస్‌కు షాక్‌! జెడ్పీటీసీ సభ్యురాలు పార్టీకి గుడ్‌బై.. | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు షాక్‌! జెడ్పీటీసీ సభ్యురాలు పార్టీకి గుడ్‌బై..

Mar 16 2024 1:35 AM | Updated on Mar 16 2024 11:52 AM

- - Sakshi

జెడ్పీటీసీ కరుణకు కండువా కప్పుతున్న మంత్రి

మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమక్షంలో చేరిక

కరీంనగర్‌: కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బీఆర్‌ఎస్‌కు తొలి షాక్‌ తగిలింది. కొత్తపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు పిట్టల కరుణ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి, కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం నగరంలోని ఓ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆమెకు పార్టీ కండువా కప్పి, ఆహ్వానించారు.

అలాగే మత్స్యపారిశ్రామిక సంఘం అధ్యక్షుడు పిట్టల రవీందర్‌, వార్డు సభ్యులు పిట్టల విష్ణు, పిల్లి శ్రీధర్‌, గుర్రం సత్యం, కోమలతోపాటు కొత్తూరి వెంకట్‌రాజయ్య, ముస్కు అంజిరెడ్డి, గుగులోతు దివ్య, బానోతు రవినాయక్‌, శ్రవణ్‌నాయక్‌, గంగాధర కనకయ్య కాంగ్రెస్‌లో చేరినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తపల్లి జెడ్పీటీసీ సభ్యురాలి చేరికతో కాంగ్రెస్‌ మరింత బలోపేతం అవుతుందన్నారు.

ముదిరాజ్‌ కులస్తుల అభ్యున్నతికి కృషి చేస్తామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ముదిరాజ్‌లకు న్యాయం జరగలేదని, అందుకే కాంగ్రెస్‌లో చేరామని జెడ్పీటీసీ సభ్యురాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నగర శాఖ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

ఇవి చదవండి: కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement