
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల దృష్టంతా యువత ఓట్లపైనే ఉంది. తాయిలాలతో ప్రలోభపెట్టి, గంపగుత్తగా ఓట్లు దండుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ యువత ప్రలోభాలకు లొంగొద్దు.
– రఘురామన్
ఓటు వజ్రాయుధం
కరీంనగర్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలి. ఆ దిశగా ఆలోచించే అభ్యర్థులకు యువత ఓటు వేసి, గెలిపిస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఓటు వజ్రాయుధం. సరైన అభ్యర్థికే వేయాలి.
– జె.తెజస్వి
