‘నువ్వు లేకుండా ఎలా బతికేది..’ కువైట్‌లో ఘ‌ట‌న‌..! | - | Sakshi
Sakshi News home page

‘నువ్వు లేకుండా ఎలా బతికేది..’ కువైట్‌లో ఘ‌ట‌న‌..!

Published Tue, Nov 21 2023 12:40 AM | Last Updated on Tue, Nov 21 2023 7:54 AM

- - Sakshi

సాక్షి, కరీంనగర్: ఉపాధివేటలో గల్ఫ్‌ బాట పట్టిన యువకుడి శవపేటికలో తిరిగి రావడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘నువ్వు లేకుండా ఎలా బతికేది..’ అంటూ మృతుని భార్య రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. మండలంలోని అనంతపల్లికి చెందిన బుర్ర గంగాధర్‌గౌడ్‌(44) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం కువైట్‌ వెళ్లాడు. అక్కడ పెట్రోల్‌బంక్‌లో పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. బుధవారం పనిచేస్తుండగా గుండెపోటు రావడంతో అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందగా.. సోమవారం శవపేటిక స్వగ్రామానికి చేరింది. శవపేటికపై పడి భార్య లక్ష్మి, తల్లి గంగవ్వ రోదనలు మిన్నంటాయి. మృతునికి తండ్రి సత్తయ్య, తల్లి గంగవ్వ, భార్య లక్ష్మి, కుమారుడు మనివర్ధన్‌, కూతురు మణిదీప్తి ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement