పెద్దపులి సంచారంతో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

పెద్దపులి సంచారంతో అప్రమత్తంగా ఉండాలి

Feb 9 2026 7:51 AM | Updated on Feb 9 2026 7:51 AM

పెద్ద

పెద్దపులి సంచారంతో అప్రమత్తంగా ఉండాలి

చిగురుమామిడి: కోహెడ మండల పరిధిలో పెద్దపులి సంచరిస్తుందన్న సమాచారంతో చిగురుమామిడి మండలంలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ ఎం.రమేశ్‌ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కోహెడ మండల అటవీప్రాంతంలో పెద్దపులి తిష్టవేసినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారని తెలిపారు. పులి కదలికలు చిగురుమామిడి మండల సరిహద్దులకు చేరువలో ఉండటంతో రానున్న రెండు రోజులు రైతులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రైతులు పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని, చుట్టుపక్కల రైతులతో కలిసి వెళ్లాలని సూచించారు. పులికదలికలు కనిపించినా, పశువులపై దాడిచేసి చంపినట్లు కనిపించినా తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఇస్రో సైంటిస్టుగా కొడిమ్యాల యువకుడు

కరీంనగర్‌టౌన్‌: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ముమ్మాడి రాజసింహ ఇస్రో సైంటిస్ట్‌గా ఎంపికయ్యాడు. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజశేఖర్‌, ఉమారాణిల కుమారుడు రాజసింహ జగిత్యాలలో 10 వ తరగతి, వరంగల్‌లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశా డు. జేఈఈ అడ్వాన్స్‌ ద్వారా కేరళ తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో ఏరో స్పేస్‌ ఇంజినీరింగ్‌ సీటు సాధించాడు. బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతుండగానే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లో ఇస్రో సైంటిస్టుగా ఎంపికయ్యాడు. దీంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన పలువురు రాజసింహను అభినందించారు.

పెద్దపులి సంచారంతో అప్రమత్తంగా ఉండాలి1
1/2

పెద్దపులి సంచారంతో అప్రమత్తంగా ఉండాలి

పెద్దపులి సంచారంతో అప్రమత్తంగా ఉండాలి2
2/2

పెద్దపులి సంచారంతో అప్రమత్తంగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement