chandurthi
-
‘నువ్వు లేకుండా ఎలా బతికేది..’ కువైట్‌లో ఘటన..!
సాక్షి, కరీంనగర్: ఉపాధివేటలో గల్ఫ్ బాట పట్టిన యువకుడి శవపేటికలో తిరిగి రావడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘నువ్వు లేకుండా ఎలా బతికేది..’ అంటూ మృతుని భార్య రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. మండలంలోని అనంతపల్లికి చెందిన బుర్ర గంగాధర్‌గౌడ్(44) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లాడు. అక్కడ పెట్రోల్‌బంక్‌లో పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. బుధవారం పనిచేస్తుండగా గుండెపోటు రావడంతో అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందగా.. సోమవారం శవపేటిక స్వగ్రామానికి చేరింది. శవపేటికపై పడి భార్య లక్ష్మి, తల్లి గంగవ్వ రోదనలు మిన్నంటాయి. మృతునికి తండ్రి సత్తయ్య, తల్లి గంగవ్వ, భార్య లక్ష్మి, కుమారుడు మనివర్ధన్, కూతురు మణిదీప్తి ఉన్నారు. -
ఎంగేజ్మెంట్ అయిన మరునాడే యువతి కిడ్నాప్ కలకలం..
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో తండ్రి చంద్రయ్య తో కలిసి శాలిని(18) అనే యువతి హనుమాన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా నలుగురు యువకులు ఆమెను లాక్కెళ్లారు. గుడి ముందు కాపుకాసి యువతి తండ్రిని కొట్టి ఆమెను ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. శాలినికి సోమవారమే ఎంగేజ్మెంట్ అయినట్లు తెలుస్తోంది. మరునాడే ఆమెను యువకుడు కిడ్నాప్ చేయడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే యువతి మైనర్‌గా ఉన్నప్పుడు గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధించాడు. దీంతో పోక్సో కేసులో అరెస్టయ్యి జైలుకు వెళ్లొచ్చాడు. అతడే తమ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటాడని చంద్రయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు రెండు బృందాలుగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. కిడ్నాప్ చేసిన యువకుడ్ని జానేశ్వర్ అలియాస్ జానుగా గుర్తించారు. చదవండి: వివాహేతర సంబంధాలకు కారణాలివే.. సర్వేలో షాకింగ్ విషయాలు -
విషాదం: పెళ్లి బారాత్‌లో ఆగిన గుండె
సాక్షి, వేములవాడ: పెళ్లి బారాత్‌లో ఏర్పాటు చేసిన డీజే పాటలతో యువకులు డ్యాన్స్‌లు, కేరింతలు, ఈలలతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో డీజే సౌండ్ కారణంగా పెళ్లి వాహనంలో ఉన్న వృద్దురాలికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. సంతోష క్షణాల మధ్య గడుపుతున్న బంధువులు, కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహానికి కోనరావుపేట గ్రామానికి చెందిన నక్క విజయ (58) అనే మహిళ హాజరైంది. అప్పగింతలు పూర్తి కాగానే పెళ్లి కుమారుని వాహనంలో అనంతపల్లి గ్రామానికి శుక్రవారం రాత్రి చేరుకుంది. చదవండి: ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య.. ‘నా భర్త సైకో..’ పెళ్లి బారత్‌లో భాగంగా డీజే ఏర్పాటు చేశారు. ఈ డీజే సౌండ్ శబ్ధానికి మహిళ చాతిలో నొప్పితో కుప్పకూలింది. అప్పటి వరకు డీజే పాటలకు స్టెప్పులు వేసిన యువకుల డ్యాన్సులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఏమైందని అక్కడున్న వారందూ తెరుకునేలోపే మహిళ మృతిచెందింది. దీంతో శుభకార్యం జరిగే ఇంట్లో విషాదం అలుముకుంది. సంబరాలు జరుపుకోవాల్సిన బంధువులు మహిళ మృతదేహంతో కోనరావుపేటకు చేరుకున్నారు. చదవండి: వివాహేతర సంబంధం: ఆమె లేకపోతే బతకలేనంటూ భార్యతో చెప్పి.. -
కోతలపై రైతన్న కన్నెర్ర
రామగుండం/చందుర్తి, న్యూస్‌లైన్ : వేళాపాళా లేని విద్యుత్ కోతలతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చే దశలో పంటలకు నీరందక ఎండిపోతుంటే తట్టుకోలేక రోడ్డెక్కుతున్నారు. అధికారుల తీరుపై మండిపడుతూ సబ్స్టేషన్లను ముట్టడించి ఆందోళనకు దిగుతున్నారు. సోమవారం రామగుండం, చందుర్తి మండలాల్లో విద్యుత్ సబ్స్టేషన్లను ముట్టడించి అధికారులను నిలదీశారు. రామగుండం మండలం బ్రాహ్మణపల్లి, ఆకెనపల్లి, సోమనపల్లి, మర్రిపల్లికి చెందిన రైతులు ఆకెనపల్లి సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. నిర్దేశిత సమయంలో ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇచ్చే ఐదు గంటల కరెంటైనా సక్రమంగా ఇస్తే బాగుండునని, అధికారుల తీరుతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా నాలుగు గ్రూపులుగా విభజించి, ఐదు గంటలు త్రీఫేస్ ద్వారా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామన్న అధికారులు గంటన్నర కూడా కరెంటు ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఆందోళనలో సింగిల్‌విండో డెరైక్టర్ బండారు ప్రవీణ్‌కుమార్, రాయమల్లు, రామస్వామి, దుర్గం రాజేశ్, మల్లేశ్, దేవి శంకర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.