
షార్ట్ సర్క్యూట్ జరిగిన ఇల్లు
● రూ.6 లక్షల సామగ్రి దగ్ధం
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని నర్సింగాపూర్‌కు చెందిన ఎలగందుల శ్రీనివాస్ ఇంట్లో ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో భారీగా ఆస్తినష్టం సంభవించింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. శ్రీనివాస్ కిరాణ దుకాణాలకు తి నుబండారాల సామగ్రి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఆదివారం రాత్రి షార్ట్‌సర్క్యూట్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు లేచాయి. మంటల్లో తినుబండారాల సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు శ్రీనివాస్ తెలిపాడు. కాలిపోయిన సామగ్రి విలువ రూ.6 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నాడు.