
కరీంనగర్‌లో కేంద్ర బలగాల కవాతు
కరీంనగర్ క్రైం: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలను పోలీసులు తీసుకుంటున్నారు. సీపీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల కవాతు చేపడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ప్రజలకు చెబుతున్నారు. భద్రత కల్పించాల్సిన బాధ్యత మాది.. ఓటు వేయాల్సిన బాధ్యత మీది అంటూ ఓటుహక్కుపై అవగాహన కల్పిస్తున్నారు.
సున్నితమైన పోలింగ్ సెంటర్లు 289
జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో గల పోలీస్‌స్టేషన్ల సిబ్బందితో కలిసి కేంద్ర సాయుధ బలగాల సిబ్బంది ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తున్నారు. స్థానికంగా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచిస్తున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను దృష్టిలో పెట్టుకొని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 1,338 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 289 సున్నితమైన కేంద్రాలను గుర్తించి, ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఈ మేరకు పర్యవేక్షణ బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిననాటి నుంచి జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన 5 చెక్‌పోస్టుల వద్ద పోలీసులు, కేంద్ర బలగాల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కేంద్ర బలగాల పహారా మరింత పెరిగింది.
జిల్లాలో ఓటుహక్కుపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
కేంద్ర బలగాలతో కలిసి కవాతు
ఎన్నికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు
మొత్తం పోలింగ్ కేంద్రాలు 1,338

హుజూరాబాద్‌లో..
Comments
Please login to add a commentAdd a comment