
మధునయ్య (ఫైల్)
ఇల్లందకుంట(హుజూరాబాద్): మండలంలోని కనగర్తికి చెందిన పర్లపల్లి మధునయ్య (54) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్‌ఐ రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మధునయ్యకు ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 8న గడ్డిమందు తాగి, ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు ముందుగా జమ్మికుంటకు, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.