వినాయకుని పూజ చేసి ఇంటికి వెళ్తూ.. | Sakshi
Sakshi News home page

వినాయకుని పూజ చేసి ఇంటికి వెళ్తూ..

Published Thu, Sep 28 2023 12:56 AM

- - Sakshi

కరీంనగర్‌రూరల్‌: ఎనిమిది రోజులపాటు వినాయకుడికి నిష్టతో రెండుపూటల పూజలు చేసిన ఓ పూజారి నిమజ్జనోత్సవం బుధవారం రాత్రి చివరిపూజచేసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికులు, రూరల్‌ పోలీసుల కథనం ప్రకారం...కరీంనగర్‌ మండలం ఇరుకుల్లకు చెందిన తిరువరంగం పాపయ్యశాస్త్రి(45) పూజారిగా పనిచేస్తున్నాడు.

గణపతి నవరాత్రుల్లో భాగంగా చెర్లభూత్కూర్‌లోని వినాయక మండపాల వద్ద పూజలు నిర్వహిస్తున్నాడు. చివరిరోజు బుధవారం రాత్రి వినాయకుడి పూజలు పూర్తి చేసుకుని ద్విచక్రవాహనంపై ఇరుకుల్లకు బయల్దేరాడు. చెర్లభూత్కూర్‌ నుంచి మొగ్ధుంపూర్‌ రోడ్డుపైకి వచ్చిన ఆయన వెహికిల్‌ను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నుంచి కరీంనగర్‌ వైపు వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య వనజ, కుమారుడు భరద్వాజ్‌, కూతురు హోత్రి ఉన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement