విద్యార్థిని కాళ్లు మొక్కుతున్న అధ్యాపకుడు
జగిత్యాలక్రైం: జగిత్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ అదే కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.
విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలపడంతో విద్యార్థిని తల్లి కళాశాలకు చేరుకుని అధ్యాపకుడిని చితకబాదిన ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. చివరకు అధ్యాపకుడు విద్యార్థిని కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరాడు. సంఘటనపై ప్రిన్సిపల్ సదరు అధ్యాపకుడికి వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేశారు.



