సెల్‌ఫోన్లు అప్పగించిన ఏసీపీ మాధవి
మానకొండూర్: మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన గుండ్ల వెంకటమ్మ(83) కాకతీయ ఉపకాలువ డీబీఎం–3లో పడి మృతి చెందింది. గ్రామానికి చెందిన వెంకటమ్మ మతిస్థిమితం కోల్పోయి తి రుగుతోంది. బుధవారం రాత్రి ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. గ్రామ సమీపంలోని ఉపకాల్వలో గురువారం శవమై కనిపించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సెల్‌ఫోన్లు అప్పగింత
కరీంనగర్‌క్రైం: పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను సీఈఐర్ విధానంతో కనుగొని సీసీఎస్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో తిరిగి అప్పగించారు. మంచిర్యాలకు చెందిన డాక్టర్ తిరుపతి, షాద్‌నగర్‌కు చెందిన కె.విమల, ఎన్‌టీపీసీకి చెందిన లక్ష్మినారాయణ వారి సెల్‌ఫోన్లు పొగొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటిని సీఈఐఆర్ విధానంతో గుర్తించి అప్పగించారు. సీఐ లింగమూర్తి, ఎస్‌ఐ కిరణ్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ సురేంద్రపాల్, కానిస్టేబుల్ కనకరాజు, తిరుపతి పాల్గొన్నారు.
న్యాయవాది గల్లంతు
తిమ్మాపూర్: కరీంనగర్ హౌసింగ్‌బోర్డ్‌కాలనీ చెందిన న్యాయవాది వేణుగోపాల్ రావు(43) కాకతీయ కాలువలో గల్లంతయ్యాడని ఎంల్‌ఎండీ పోలీసులు తెలిపారు. బుధవా రం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటినుంచి బయటకు వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలి పారు. అతని కోసం గాలించగా గురువారం కాకతీయ కెనాల్ వద్ద ద్విచక్రవాహనం కనిపించింది. దీంతో కాలువలో గల్లంతయి ఉంటాడని గాలింపు చేపట్టారు.
కొత్త ఓటరు కార్డులొచ్చాయ్
కరీంనగర్ అర్బన్: నూతన ఓటరు కార్డులొచ్చాయి. ఏపీ సిరీస్‌తో ఉన్న కార్డుల స్థానంలో కొత్తవాటిని ముద్రించి కలెక్టరేట్‌కు పంపించారు. కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాలకు ఆయా ఓటరు కార్డుల బాక్సులను సరఫరా చేయనుండగా బీఎల్‌వోలు ఓటర్లకు అందజేయనున్నారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయాలకు సరఫరా చేయనున్నారు.
వెంకటమ్మ మృతదేహం


