మాట్లాడుతున్న బీసీ సంఘాల నేతలు
కరీంనగర్: ఓబీసీ బిల్లును తక్షణమే పార్లమెంట్‌లో ఆమోదించాలని బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం సంఘ కార్యాలయంలో బీసీ సంఘాల సమన్వయకర్త బిజిగిరి నవీన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ సంఘం నేతలు మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ల బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సమాజంలో అత్యధికశాతం జనాభా ఉన్న బీసీలకు అన్యా యం చేయడం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగదని సూచించారు. త్వరలో ఉమ్మడి జిల్లా బీసీనేతలతో కరీంనగర్‌లో సదస్సు ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. అఖిలభార త గౌడసంఘం యూత్ అధ్యక్షుడు గొడిశాల రమేశ్‌గౌడ్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు సర్దార్ రణధీర్ సింగ్ రాణా, కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి ఐలయ్య, పద్మశాలి సంఘం ప్రతినిధి ఒడ్నాల రాజు, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు సదానందం, ముదిరాజ్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్, బీసీ సంఘాల నేతలు ఆంజనేయ స్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు.


