పుస్తకాన్ని ఆవిష్కస్తున్న చంద్రబోస్
కరీంనగర్ కల్చరల్: దేశభక్తిని చాటి చెప్పే సారాంశంతో కూడిన ఓ సైనికుని కథాంశంతో కరీంనగర్‌కు చెందిన పసుల రోహిత్ సాయి రచించిన ప్రియ భారత జననీ పుస్తకాన్ని గురువారం హైదరాబాద్‌లో సినీ గేయ రచయిత చంద్రబోస్ ఆవిష్కరించారు. చంద్రబోస్ మాట్లాడుతూ పసుల రోహిత్ సాయి చిన్న వయస్సులోనే దేశభక్తిని చాటే కథాంశంతో కూడిన పుస్తకం రచించడం అభినందనీయమని అన్నారు. అనంతరం రోహిత్ సాయి మాట్లాడుతూ పుస్తకంలో కొన్ని సన్నివేశాలు నిజ జీవిత సన్నివేశాల నుంచి ప్రేరణ పొంది రాయబడినవని, ఓ సైనికుడు తన దేశాన్ని రక్షించడానికి ఎన్ని త్యాగాలు చేస్తాడనే అంశం వివరించినట్లు తెలిపారు.


