కరీంనగర్‌టౌన్: నకిలీ బాప్టిజం సర్టిఫికెట్లతో రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీ స్కూళ్లలో సీట్లతో పాటు క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో లక్షలాది రూపాయల సబ్సిడీ గ్రాంట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై, బాప్టిజం సర్టిఫికెట్లు జారీ చేసిన వారిపై విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కమిటీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ తాజొద్దీన్ డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నకిలీ బాప్టిజం సర్టిఫికెట్లతో నిజమైన క్రిస్టియన్ మైనారిటీలకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో నాయకులు సయ్యద్ అఖిల్, తమ్మడి ఎజ్రాదేవ్, లయిక్, ఖాద్రి, ఖలిం, బొబ్బిలి విక్టర్ తదితరులు పాల్గొన్నారు.


