‘భీమదేవరపల్లి బ్రాంచి’ డైరెక్టర్‌ మనోడే | - | Sakshi
Sakshi News home page

‘భీమదేవరపల్లి బ్రాంచి’ డైరెక్టర్‌ మనోడే

Jun 23 2023 1:48 AM | Updated on Jun 23 2023 1:48 PM

టీజర్‌ లాంచ్‌ చేస్తున్న కేటీఆర్‌  - Sakshi

టీజర్‌ లాంచ్‌ చేస్తున్న కేటీఆర్‌

వీణవంక(హుజూరాబాద్‌): ఈ మధ్యకాలంలో చిన్న, పెద్ద సినిమా తేడాలేకుండా కంటెంట్‌ బాగుంటే అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆసక్తికరమైన కథతో తీసిన సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచి’. ఈ చిత్రం టీజర్‌ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవల లాంచ్‌ చేశారు. యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న ఈ సినిమా శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని 140 థియేటర్లలో విడుదల చేయనున్నారు. సినిమా దర్శకుడు రమేశ్‌ చెప్పాల వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందినవాడు. మాటలు, కథ, పుస్తక రచయితగా గుర్తింపు పొందారు. ఈ చిత్రానికి మాటల రచయితతో పాటు దర్శకత్వం వహించాడు. సినిమాలోని పాటలు రాష్ట్రంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. చరన్‌అర్జున్‌ సంగీత సారథ్యంలోని ‘ఎల్లమ్మ’ పాట తెలంగాణ యాసలో శ్రోతలను ఆకట్టుకుంది. శుక్రవారం సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ‘సాక్షి’తో మాట్లాడారు.

గవర్నమెంట్‌ స్కూల్‌ నుంచే
మేము ముగ్గురు అన్నదమ్ములం, ఇద్దరు అక్కలు నేను చిన్నోడిని, తల్లిదండ్రులు వైకుంఠం, కమల. ఐదో తరగతి వరకు మా గ్రామంలోని ప్రభుత్వ స్కూల్లో చదివాను. ఆరు నుంచి పదోతరగతి వీణవంక, హుజూరాబాద్‌ హైస్కూళ్లలో చదివి ఇంటర్‌, డిగ్రీ, ఆపై చదువులు హైదరాబాద్‌లో పూర్తి చేశాను. చిన్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం చాలా ఇష్టం. ఇటీవల నేను రాసిన ‘మా కనపర్తి ముషాయిరా’ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చదివి ప్రశంసాపత్రం అందించారు. ఇదీ జీవితంలో మరిచిపోలేను. ‘బాంబే డాల్‌’, శ్రీరాజరాజేశ్వరి యాత్ర స్పెషల్‌’ వంటి పుస్తకాలు రాశాను. బాంబేడాల్‌ పుస్తకం ఆధారంగా ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ అసోసియేట్‌ సురేన్‌ రైట్స్‌ తీసుకొని హిందీలో సినిమా తీయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉండడంతో పుస్తకాలు రాయలేకపోతున్నాను.

మీ శ్రేయోభిలాషి చిత్రంకు నంది అవార్డు...
చదువులు పూర్తయిన తర్వాత ఐదేళ్ల పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్‌లో చేరాను. 2007లో రాజేంద్రప్రసాద్‌ హీరోగా నటించిన మీ శ్రేయోభిలాషి సినిమాకు మాటల రచయితగా నంది అవార్డు రావడంతో ఇండస్ట్రీలో గుర్తుండిపోయాను. సినిమాకు మొత్తం తొమ్మిది అవార్డులు వచ్చాయి. 2008లో బెవర్స్‌ సినిమాకు దర్శకత్వం వహించాను. ఈ చిత్రం ప్రేక్షకులకు చాలా కనెక్ట్‌ అయింది. ఇంకా పలు సినిమాలకు మాటలు, కథ అందించాను. పెద్ద హీరోలతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాను.

భీమదేవరపల్లి బ్రాంచి డిఫరెంట్‌ స్టోరీ...
భీమదేవరపల్లి గ్రామంలోని బ్యాంకు బ్రాంచికి సంబంధించిన కథ. సినిమా పేరు ఆసక్తిగా ఉందని చాలా మంది అన్నారు. నాయకుల హామీతో ఓ గ్రామం మొత్తం అతలాకుతలం అవుతుంది. దాన్నే కథాంశంగా తీసుకొని సినిమా తీశాం. నిర్మాతలు కీర్తిలలితగౌడ్‌, రాజానరేందర్‌ బాగా సపోర్ట్‌ చేశారు. ‘బలగం’ఫేం సుధాకర్‌రెడ్డి, అంజి హీరోయిన్‌ ప్రసన్న, సీబీఐ మాజీ డైరెక్టర్‌ జేడీ లక్ష్మినారాయణ, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రావు, కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌ ఇందులో నటించారు. జేడీ లక్ష్మినారాయణ కథ చెప్పగానే ఒప్పుకున్నారు. కొత్త నటులకు ఎక్కువ అవకాశం ఇచ్చాం. మంత్రి కేటీఆర్‌ టీజర్‌ ను విడుదల చేసి మంచి ఫ్యూచర్‌ ఉందన్నారు. ఇటీవల ప్రివ్యూ షో చూసిన ప్రముఖులు అభినందించారు. చరన్‌అర్జున్‌ మంచి సంగీతం అందించా డు. మరో మూడు సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్లు ముందుకువస్తున్నారు. ఎవరికి కమిట్‌మెంట్‌ కాలేదు. విద్యాబాలన్‌ లీడ్‌ రోల్‌గా సినిమా చేయా లని ఓ ప్రొడ్యూసర్‌ అడుగుతున్నాడు. ఎంత బిజీగా ఉన్న మా సొంత ఊరును మాత్రం మరిచిపోను. వీణవంక మండలం నుంచి చాలా మంది మిత్రులు ఫోన్లు చేస్తుంటారు. రాబోయే రోజుల్లో మండలంలోని వారికి అవకాశలు ఇచ్చేందుకు కృషి చేస్తా.

భీమదేవరపల్లి బ్రాంచి పోస్టర్‌ 1
1/3

భీమదేవరపల్లి బ్రాంచి పోస్టర్‌

ముషాయిరా కథలు 2
2/3

ముషాయిరా కథలు

రమేశ్‌ చెప్పాల 3
3/3

రమేశ్‌ చెప్పాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement