
నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం అఖండ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్గా అఖండ-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా బాలయ్య ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ టీజర్‌లో బాలయ్య మాస్ యాక్షన్ సీన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఈ దసరాకు రిలీజ్ కావాల్సిన అఖండను మేకర్స్ వాయిదా వేశారు. కొత్త రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.
(ఇది చదవండి: అనుకున్నదే అయింది.. అఖండ-2 వాయిదా.. పవన్ కల్యాణ్ కోసమేనా?)
అయితే బాలకృష్ణ సినీ ప్రస్తానం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఆయనను సత్కరించింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బాలయ్యపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయనను చూస్తే మాటలు రావని.. ఏదో ఒకటి తీసి కొట్టాలని అనిపిస్తుందని అన్నారు. మ్యూజికల్ పరంగా నా చేతుల్లో కొత్తగా కత్తులు, కర్రలు వచ్చేస్తాయి.. ఈ విషయం నాకు కూడా అర్థం కాదన్నారు. అలా ఎందుకు జరుగుతుందో డాక్టర్స్ నా డీఎన్ఏ టెస్ట్ చేయాలని ఆసక్తికర కామెంట్స్ చేశారు. త్వరలో అఖండ 2 రికార్డులు కొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అఖండ -2 సినిమాకు తమన్ సంగీతమందిస్తున్న సంగతి తెలిసిందే.