నిర్మల్‌లో చెన్నయ్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌లో చెన్నయ్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

Oct 2 2026 1:22 AM | Updated on Oct 2 2026 1:22 AM

● సినీనటి శ్రీలీల రాకతో అభిమానుల సందడి..

నిర్మల్‌టౌన్‌: నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ది చెన్నయ్‌ షాపింగ్‌ మాల్‌ గురువారం వైభవంగా ప్రారంభమైంది. సినీనటి శ్రీలీల మాల్‌ను ప్రారంభించారు. అనంతరం షాపింగ్‌మాల్‌ అంతా కలియతిరుగుతూ.. వస్త్రాలు, ఫ్యాషనన్‌ ఉత్పత్తులను పరిశీలించారు. అదిరిపోయే ప్రారంభం ఆఫర్లు ఉండడంతో పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు వచ్చారు. దీంతో మాల్‌ సందడిగా మారింది. పండుగలు, వివాహాలు, శుభకార్యాలతో పాటు నిత్య అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల వస్త్రాలు, సరికొత్త ఫ్యాషనన్‌ డిజైన్లు అందుబాటులోకి తీసుకురావడంతో ఆసక్తిగా షాపింగ్‌ చేశారు. కుటుంబ సమేతంగా ఒకే చోట అన్నిరకాల వస్త్రాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉండటంతో ప్రారంభం రోజే మంచి స్పందన కనిపించింది.

కుటుంబ సమేతంగా షాపింగ్‌ చేయండి

మాల్‌ ప్రారంభించిన అనంతరం శ్రీలీల మాట్లాడు తూ కుటుంబ సమేతంగా షాపింగ్‌ చేయాలని కోరా రు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా లక్షలాది డిజైన్లతో వస్త్రాలను అందుబాటులో ఉన్నాయన్నారు. చెన్నయ్‌ షాపింగ్‌ మాల్‌ వినియోగదారుల నమ్మకానికి చిరునామాగా నిలుస్తుందని పేర్కొన్నారు. శ్రీలీలను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీలీల సైతం అభిమానులను పలకరిస్తూ, చేతులు ఊపుతూ సందడి చేశారు. కార్యక్రమంలో మర్రి రిటైల్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మర్రి వెంకటరెడ్డి, డైరెక్టర్‌ కృష్ణారావు, మాల్‌ నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement