పేదల సొంతింటి కల సాకారం | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల సాకారం

Oct 2 2026 1:22 AM | Updated on Oct 2 2026 1:22 AM

● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ

● రెండో విడతలో 106 మందికి

ప్రొసీడింగ్స్‌ అందజేత

కామారెడ్డి టౌన్‌: పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణానికి చెందిన రెండో విడత 106 మంది లబ్ధిదారులకు ఆయన ప్రొసీడింగ్స్‌ కాపీలను అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఎన్నికల హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. జిల్లా కేంద్రంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాలను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి, వైస్‌ చైర్‌పర్సన్‌ కాసార్ల గోదావరి, మున్సిపల్‌ కమిషనర్‌ పర్వతాలు, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఐరేని సందీప్‌, కౌన్సిలర్లు వాజీద్‌, జావీద్‌, సావిత్రి, అ ఖిల, స్వప్న, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్‌, షేరూ, నాయకులు ఇప్ప శ్రీనివాస్‌, యూనుస్‌, అన్వర్‌, మన్సూర్‌, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సదాశివనగర్‌/ భిక్కనూరు/ ఎల్లారెడ్డి: పేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యమని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నారు. సదాశివనగర్‌ మండలం పద్మాజీవాడి గ్రామంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన ప్రొసీడింగ్‌ కాపీలను సర్పంచ్‌ లోకోటి సుబ్బారావు గురువారం పంపిణీ చేశారు. పనులను త్వరగా పూర్తి చేసి బిల్లులు పొందాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ రాజశేఖరరెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు మండలంలోని జంగంపల్లిలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ధ్రువీకరణ పత్రాలను అందించారు. అనంతరం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఉపసర్పంచ్‌ ప్రకాశ్‌గౌడ్‌, జీపీ కార్యదర్శి దయాకర్‌రెడ్డి, నేతలు వాసు యాదవ్‌, సత్యం, కొండం రవి, కార్తిక్‌, రామస్వామి, బాబు, నర్సింలు, భాను, బాలయ్య పాల్గొన్నారు. ఎల్లారెడ్డిలో పలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మున్సిపల్‌ చైర్మన్‌ పద్మ శ్రీకాంత్‌ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గఫార్‌, గాయత్రి, దశరథం, మున్సిపల్‌ కమిషనర్‌ జగ్జీవన్‌, కో–ఆప్షన్‌ సభ్యులు వెంకటేశం, సొసైటీ వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌గౌడ్‌, నాయకులు శ్యాం, శంకర్‌, రాములు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సర్పంచ్‌ చిందం మల్లేశ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ గూడెం శ్రీనివాస్‌రెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ సిద్ధం స్వామి, వార్డు సభ్యులు మల్లి పెద్ద మనెవ్వ, షేక్‌ అజీజ్‌, లోకోటి మోహన్‌ రావు, దుబ్బాక సంతోష్‌, కనకంటి లక్ష్మి, కొత్త బాలమణి, కొప్పుల సాయవ్వ, మదాని నవీన్‌ కుమార్‌, చెట్కూరి ప్రణీత్‌ కుమార్‌, డైరెక్టర్‌ కన్కంటి చిన్న సాయిలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement