● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
మాచారెడ్డి: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని సింగిల్ విండోలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజాపాలనలో రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం తూకం, నాణ్యత పరిశీలన, కొనుగోలు చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకత పాటించాలన్నారు. అలాగే కామారెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రామ్మోహన్ తల్లి చంద్రకళ అనారోగ్యంతో మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ సలహాదారు పరామర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరళ, మాచారెడ్డి సొసైటీ చైర్మన్, పార్టీ మండల అధ్యక్షుడు నౌసిలాల్, సర్పంచ్ సంతోష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కామారెడ్డి సొసైటీ చైర్మన్ గూడెం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గణేశ్ నాయక్, సొసైటీ డైరెక్టర్లు శ్రీధర్ రావు, ఆనంద్ రెడ్డి, లక్యా నాయక్, నవీన్ రెడ్డి, వెంకట్ రాజు, పంతం స్వామి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, సులోచన, లడ్డు, సర్పంచులు వినోద, అనిల్, శంకర్ నాయక్, రాంచంద్రం, ఉపసర్పంచ్ రాజు, బన్సీలాల్, రాజిరెడ్డి, అజిజ్ సహకార సంఘం ప్రతినిధులు ఉన్నారు.


