ఖానాపూర్‌లో వ్యక్తి హత్య | - | Sakshi
Sakshi News home page

ఖానాపూర్‌లో వ్యక్తి హత్య

Oct 2 2026 1:22 AM | Updated on Oct 2 2026 1:22 AM

ఖానాపూర్‌లో వ్యక్తి హత్య

నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఒకటవ డివిజన్‌లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు ఇలా.. ఖానాపూర్‌కు చెందిన చాకలి సంఘం లింగం(55) భార్య గత సంవత్సరం మృతిచెందగా, అప్పటి నుంచి ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. తన ఇంట్లో బుధవారం రాత్రి అతడు నిద్రపోయాడు. గురువారం ఉదయం అతడి ఇంట్లో నుంచి పొగలు వస్తుండటం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని చూడగా, లింగం హత్యకు గురైయ్యాడు. రాత్రివేళ గుర్తుతెలియని దుండగులు అతడి తలపై ఫ్యాన్‌తో కొట్టి, దుప్పట్లు వేసి కాల్చి వేసినట్లు గుర్తించారు. ఏసీపీ ప్రకాశ్‌, రూరల్‌ ఎస్‌హెచ్‌వో ఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. మృతుడి మేనల్లుడి ిఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement