బాన్సువాడ రూరల్: రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా వారు పండించిన ప్రతి గింజను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మండలంలోని కొల్లూరు, తాడ్కోల్ సొసైటీల్లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఖరీఫ్, ధాన్యం కోతలు ఇతర జిల్లాలతో పోలిస్తే ముందుగానే ప్రారంభమయ్యాయన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం అర్హత కలిగిన సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 ప్రోత్సాహక బోనస్ అందించనున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.


