ఎల్లారెడ్డిరూరల్: జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి క్విజ్, స్పెల్ బీ పో టీల్లో ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ ప్రదర్శించారు. క్విజ్ పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతిని ఫైజి యా గ్రూప్, స్పెల్ బీ పోటీలో అశ్విని ద్వితీయ బహుమతి గెలపుపొందారు. జిల్లా స్థాయిలో బహుమతులు సాధించిన వివ్యార్థులను అదనపు కలెక్టర్ విక్టర్, డీఈవో మల్లికార్జున్ బహుమతులను అందించారు. విద్యార్థులకు గైడ్ టీచర్‌గా రాజశేఖర్ వ్యవహరించారు. విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
కబ్జాకు గురైన స్థలం చదును
కామారెడ్డి రూరల్: తిమ్మక్‌పల్లి(కె) గ్రామంలో సర్వే నెంబర్ 30లో గల 6ఎకరాల 30 గుంటల భూమి కబ్జాకు గురైందని, దీనిని గ్రామస్తులు గురువారం చదును చేశారు. అంతేకాకుండా ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, ఈ భూమిని రైతుల సౌకర్యార్థం రైతు కల్లాలకు కేటాయించనున్నట్లు తహసీల్ కార్యాలయం వారు బోర్డు పెట్టినట్లు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఉన్నారు.


