సీఈసీ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

సీఈసీ రాజీనామా చేయాలి

Sep 29 2026 1:21 AM | Updated on Sep 29 2026 1:21 AM

సీఈసీ రాజీనామా చేయాలి

● జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

● కామారెడ్డిలో కాంగ్రెస్‌ నిరసన..

కలెక్టర్‌కు వినతి

కామారెడ్డి టౌన్‌ : ఓటు హక్కు పరిరక్షణ, ఓటర్ల జాబితాలో పారదర్శకత నిర్వీర్యం చేస్తున్న సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు డిమాండ్‌ చేశారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా, నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్‌ ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలు ఎన్నికల సంఘాన్ని తమ గుప్పిట్లో ఉంచుకుని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను జాబితా నుంచి తొలగిస్తూ, అనుకూల ఓట్లను మాత్రమే ఉంచుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం ఏకపక్ష వైఖరికి నిరసనగా సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు మహమ్మద్‌ ఇలియాస్‌, డీసీసీ జిల్లా అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌, ఽగ్రంథాలయ చైర్మన్‌ మద్ది చంద్రకాంత్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కై లాస్‌ శ్రీనివాస్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఐరేని సందీప్‌ కుమార్‌, పండ్ల రాజు, ఇప్ప శ్రీనివాస్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement