సమస్యను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యను పరిష్కరించాలి

Sep 29 2026 1:27 AM | Updated on Sep 29 2026 1:27 AM

సమస్యను పరిష్కరించాలి

భిక్కనూరు : మండలంలోని రెండు గ్రామాల మధ్య నెలకొన్న చెరువు సమస్యను వెంటనే పరిష్కరించాలని ఇసన్నపల్లి గ్రామస్తులు కోరారు. సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇసన్నపల్లి– భగీరథ పల్లి గ్రామాల మధ్య ఉన్న చెరువును తమ గ్రామ పరిధిలో ఉందని భగీరథ పల్లి గ్రామస్తులు గ్రామస్తులు ఆరోపిస్తూ వినాయక నిమజ్జనాన్ని అడ్డుకున్నారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా చెరువులో వినాయకులను, బతుకమ్మలను నిమజ్జనం చేస్తున్నామని చెప్పారు. చెరువులో చాపలు పెంచి భగీరథ పల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్‌ కులస్తులు పట్టుకుంటారని తెలిపారు. ప్రస్తుతం రెండు గ్రామాల మధ్య చెరువు వివాదం ఏర్పడిందన్నారు. వెంటనే సర్వే చేయించి సమస్యను పరిష్కరించాలని తహసీల్దారు సునీతను కోరారు. అనంతరం సమస్యను పోలీసులకు పరిస్థితిని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement