రామారెడ్డి(ఎల్లారెడ్డి): రామారెడ్డి మండలకేంద్రంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రా త్రి వేళల్లో ద్విచక్ర వాహనదారుల వెంట భయపడుతున్నాయి.దీంతో వాహనదారులు నియంత్రణ కోల్పోయి కిందపడి గాయపడిన ఘటనలున్నా యి. రామారెడ్డిలోని కాలభైరవ స్వామి దేవాలయ మూలమలుపు వద్ద నడిరోడ్డుపైనే వీధి కుక్కలు సంచరిస్తున్నాయి. రాత్రివేళలో వాహనాల వెంట పడుతున్నాయి. గతేడాది కాలంలో 8 నుంచి 9 మంది వరకు కుక్కకాటుకు గురైన బాధితులున్నా రు.సంబంధిత పంచాయతీ అధికారులు స్పందించి, మూలమలుపుల వద్ద ప్రమాదాలకు కారణమవుతున్న ఈ వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.


