బాన్సువాడ రూరల్: బాన్సువాడ పట్టణంలోని కోటగల్లి, బండాగల్లీ, సిద్దిగల్లీ, పోచమ్మగల్లి, హనుమాన్ గల్లిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం బాన్సువాడ మండల కార్యాలయంలో కాలనీవాసులు ఎంపీడీవో ఆనంద్‌కు వినతి పత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 కింద 52కోట్ల నిధులు విడుదల చేసినా అధికారుల నిర్లక్ష్యం మూలంగా పనులు జరగకపోవడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నాయకులు కోనాల గంగారెడ్డి, శంకర్‌గౌడ్, చిరంజీవి, మహేష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


