మటన్‌ పంచాయితీ! | - | Sakshi
Sakshi News home page

మటన్‌ పంచాయితీ!

Sep 29 2026 1:27 AM | Updated on Sep 29 2026 1:27 AM

● ధర పెంచడంపై ప్రజావాణిలో ఫిర్యాదు

● పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కిన ప్రజాప్రతినిధులు, మటన్‌షాప్‌ నిర్వాహకులు

దోమకొండ: మటన్‌ ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయం మటన్‌ షాప్‌ల నిర్వాహకులు, ప్రజల మధ్య పంచాయితీగా మారింది. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఇటీవల కిలో మటన్‌ ధరను రూ. 800 నుంచి రూ. 900లకు పెంచారు. అయితే ఎవరికీ సమాచారం ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నారంటూ పంచాయతీ పాలకవర్గం ఆరోపిస్తోంది. ఈ విషయమై మటన్‌ షాప్‌ల నిర్వాహకులను పంచాయతీకి పిలిపించి మాట్లాడగా.. దుర్భాషలాడుతూ దాడికి యత్నించారని సర్పంచ్‌ నర్సయ్య, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, వార్డుసభ్యులు, నేతలు సిద్దారెడ్డి, అనంతరెడ్డి పేర్కొంటూ సోమవారం మండల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం పోలీసులకూ ఇదే విషయమై ఫిర్యాదు ఇచ్చారు. కాగా మటన్‌ రేట్‌ విషయంలో గ్రామపంచాయతీ వద్ద తమను దూషించారంటూ మటన్‌ షాప్‌ల నిర్వాహకులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement