కమ్మర్‌పల్లి(భీమ్‌గల్):భీమ్‌గల్ మండలం ముచ్కూ ర్, పట్టణంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాల యం,ఏర్గట్ల,వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ గ్రామాల ఉన్నత పాఠశాలలకు వ్యాపారవేత్త ఏను గు దయానంద్‌రెడ్డి చేయూత అందించారు. బా ల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సౌజన్యంతో ము చ్కూర్, ఏర్గట్ల, పచ్చలనడ్కుడ పాఠశాలలకు రూ. 1.80లక్షల చొప్పున సైన్స్ ల్యాబ్ సామగ్రిని, కేజీబీవీకి రూ. 1,46,650 విలువైన డ్యూయెల్ డెస్క్ బెంచీలను వితరణ చేశారు. వేల్పూర్‌లోని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సోమవారం తన నివాసంలో ఆయా పాఠశాలల ప్రతినిధులకు ల్యాబ్ మెటీరియల్, డె స్క్ బెంచీలను అందజేశారు. గ్రామ సర్పంచ్‌లు, ఉ పాధ్యాయులు, పాఠశాల యాజమాన్య ప్రతినిధు లు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


