అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

Sep 28 2026 1:17 AM | Updated on Sep 28 2026 1:17 AM

● అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ డిప్యూటీ

డైరెక్టర్‌ పురుషోత్తం

● ఉల్లాస్‌ పరీక్ష కేంద్రాల పరిశీలన

సదాశివనగర్‌/బాన్సువాడ రూరల్‌/ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్‌: నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని అడల్ట్‌ ఎడ్యూకేషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పురుషోత్తం సూచించారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మూడు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జాతీయ అక్షరాస్యత మిషన్‌ ఆధ్వర్యంలో భాగంగా డీఆర్‌డీఏ, సెర్ప్‌ ఆధ్వర్యంలో ‘ఉల్లాస్‌’ అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. సదాశివనగర్‌ మండలంలో 650 మంది పరీక్షలు రాసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో 520 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. గ్రామ సంఘాల్లో చదవడం, రాయడం రాని మహిళలను గుర్తించి వారికి ఈ పరరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. ఉల్లాస్‌ పరీక్షలను పకడ్బందిగా నిర్వహించారు. సర్పంచ్‌ వంకాయల శిరీష, ఉప సర్పంచ్‌ ప్రవీణ్‌కుమార్‌, ఏపీఎం ప్రసాద్‌, వీవోఏలు సామల మమత, పద్మావతి, నూతన, లావణ్య, సీసీలు పాల్గొన్నారు. బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌ గ్రామ సంఘంలో ఆదివారం నిర్వహించిన ఉల్లాస్‌ పరీక్షా కేంద్రాన్ని జిల్లా, మండల స్థాయి అధికారులు సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు అధికారి విజయలక్ష్మి, మండల సమాఖ్య కార్యదర్శి మంజుల, ఉల్లాస్‌ జిల్లా స్థాయి అధికారి రవీందర్‌, ఏపీఎం నాగరాజు పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. వారితో పాటు సీసీలు అమృత, సాయిలు కూడా పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలో మెప్మా, మండలంలోని పలు గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఆదివారం వయోజన మహిళలకు ఉల్లాస్‌ పరీక్షలను నిర్వహించారు. ఈపరీక్ష కేంద్రాలను డీపీఎం శ్రీనివాస్‌ పరిశీలించారు.

సర్పంచ్‌ గొల్ల లక్ష్మి పరీక్షకు హాజరు

తిర్మలాపూర్‌ గ్రామ సర్పంచ్‌ గొల్ల లక్ష్మి కూడా ఉల్లాస్‌ పరీక్షకు హాజరై పరీక్ష రాశారు. ప్రజా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తూనే విద్యాభ్యాసంపై ఆసక్తి చూపుతూ పరీక్షకు హాజరు కావడం విశేషంగా నిలిచింది. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు ఉత్సాహంగా పరీక్ష రాశారు.

ప్రశాంతంగా ఉల్లాస్‌ పరీక్షలు

నిజాంసాగర్‌/గాంధారి/భిక్కనూరు/నాగిరెడ్డిపేట/లింగంపేట: స్వయం సహాయక సంఘాల మహిళలకు అక్షరజ్ఞానం కల్పించేందుకు ఉల్లాస్‌ కార్యక్రమం ఎంత గానో ఉపయోగపడుతుందని అడిషనల్‌ డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. మహమ్మద్‌ నగర్‌ మండలం గున్కుల్‌ గ్రామంలో 33 మంది మహిళలకు ఉల్లాస్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సభ్యులకు సంతకాలు నేర్పడంతో పాటు అక్షరజ్ఞానం కల్పిస్తున్నామన్నారు. మండల వ్యాప్తంగా 200 మంది మహిళలకు ఉల్లాస్‌ పరీక్షకు ఎంపిక చేశామని చెప్పారు. జిల్లా ఉల్లాస్‌ కోఆర్డినేటర్‌ రవీందర్‌, ఐకేపీ ఏపీఎం ప్రసన్నరాణి, సీసీలు తదితరులున్నారు.గాంధారి మండల మహిళా సమాఖ్య పరిధిలోని మహిళా సమాఖ్య మహిళలు హాజరైన ఉల్లాస్‌ పరీక్ష కేంద్రాన్ని ఏపీడీ విజయలక్ష్మి, డీపీఎం రాజయ్య, సమన్వయ కర్త రవీందర్‌ పరిశీలించినట్లు ఏపీఎం ప్రసన్న కుమార్‌ తెలిపారు. భిక్కనూరు మండల పరిధిలో నిర్వహించిన ఉల్లాస్‌ పరీక్షకు వందశాతం మహిళలు హాజరైనట్లు ఏపీఎం తెలిపారు. నాగిరెడ్డిపేట మండలంలో 26కేంద్రాల ద్వారా 484మంది మహిళలకు ఉల్లాస్‌ రాత పరీక్షను నిర్వహించినట్లు ఏపీఎం దత్తు తెలిపారు. లింగంపేట ఐకేపీ ఆధ్వర్యంలో గ్రామ సంఘాల మహిళలకు అమ్మకు అక్షరమాల పరీక్ష నిర్వహించారు. లింగంపేట బాలుర ఉన్నత పాఠశాల కాంప్లెక్స్‌ హెచ్‌ఎం వహీద్‌ సిద్దిఖీ మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement