సాయం అందించాల్సిన ఫోన్‌పే, గూగుల్ పే నంబర్లు :
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన దొంతుల భైరయ్య, శిరిష దంపతులు ప్రైవేట్‌రంగంలో చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఈనెల 23న హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో వారు అద్దెకుంటున్న భవనం మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కుమారుడు హర్షిత్(13) కిందపడ్డాడు. హర్షిత్‌ను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. అతని రెండు కాళ్లు విరగడంతోపాటు వెన్నెమక సైతం దెబ్బతింది.నాలుగురోజుల్లో ఆస్పత్రిలో బాలుని చికిత్స కోసం రూ.8లక్షలపైనే ఖర్చయింది. బాలుడికి పూర్తిస్థాయిలో వైద్యం చేయించేందుకు సుమారు మరో రూ.30లక్షల వరకు ఖర్చవుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయని తండ్రి భైరయ్య చెప్పారు. ప్రైవేట్ జాబ్‌పై ఆధారపడిన తమకు అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టే స్థోమత లేదని దాయర్థాహృదయులు ఆపన్న హస్తం అందించాలని బాలుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. వైద్య ఖర్చులకు దాతలు సాయం చేస్తే తమ కుటుంబాన్ని నిలబెట్టిన వారువుతారని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
81799 18847, 83746 78374
బ్యాంకు అకౌంట్ వివరాలు :
పేరు : దొంతుల భైరయ్య
బ్యాంకు అకౌంట్ నం. 087610025021550
ఐఎఫ్‌సీ కోడ్ : యూబీఐఏన్0806048
బ్రాంచ్ పేరు : విద్యానగర్
మూడో అంతస్తు భవనం
పైనుంచి కిందపడ్డ బాలుడు
తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరిక
వైద్యానికి రూ.30లక్షల వరకు
ఖర్చవుతుందంటున్న ఆస్పత్రి వర్గాలు


