జంగంపల్లి యూత్‌ కాంగ్రెస్‌ నూతన కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

జంగంపల్లి యూత్‌ కాంగ్రెస్‌ నూతన కార్యవర్గం

Sep 28 2026 1:17 AM | Updated on Sep 28 2026 1:17 AM

జంగంపల్లి యూత్‌ కాంగ్రెస్‌ నూతన కార్యవర్గం తిప్పాపూర్‌ బీసీ యువజన కమిటీ .. మాదిగ రిజర్వేషన్‌పోరాట సమితి.. క్రీడాపోటీల్లో విద్యార్థుల ప్రతిభ

భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి యూత్‌ కాంగ్రెస్‌ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొండం రవి, ఉపాధ్యాక్షుడిగా సోహెల్‌, ఎస్సీ సెల్‌ విభాగం అధ్యక్షుడిగా పుల్లురి చందులను ఎన్నుకున్నారు. వీరికి యూత్‌ కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు శ్రీరాం వెంకటేశ్‌,ఎస్సీ ఎల్‌ మండలాధ్యక్షుడు జీవన్‌లు ధృవీకరణ పత్రాలను అందజేశారు. గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సత్యం,ఉపాధ్యాక్షుడు ప్రవీణ్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ ప్రకాశ్‌గౌడ్‌,మాజీ సర్పంచ్‌ నర్సింలు యాదవ్‌, మాజీ ఎంపీటీసీ రామస్వామి, నేతలు కార్తీక్‌, నర్సింలు,లింగం,ఆనంద్‌,సందీప్‌,సంపత్‌,చంధ్రం, ఖలీల్‌పాష,రాజు,దుర్గయ్య, చోటు తదితరులు పాల్గొన్నారు.

భిక్కనూరు: మండంలోని తిప్పాపూర్‌ గ్రామ బీసీ యువజన కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఊరడి మహేందర్‌, ఉపాధ్యాక్షులుగా బోయిని సంతోష్‌, కుమ్మరి కాశీనాథం,ప్రధాన కార్యదర్శిగా మంద రవి,కార్యదర్శిగా తాటిపల్లి రాజు, కోశాధికారిగా తెంబర్తి నరేశ్‌, సహా య కోశాధికారిగా చిలుక నరేందర్‌, ముఖ్య సలహాదారులుగా రాయినిగారి సతీష్‌, కొత్తొళ్ల నవీన్‌, మహ్మద్‌జావిద్‌లను ఎన్నుకున్నారు. బీసీ యువజన కమిటీ జిల్లా అధ్యక్షుడు సాప రాములు, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఉపాధ్యాక్షులు కాముని సుదర్శన్‌, శంకర్‌, ప్రతినిధులు రాజేందర్‌, మల్లయ్య, బీసీ సంఘం అధ్యక్షుడు రాములు, గౌరవ అధ్యక్షుడు కొండ సాయిలు తదితరులు పాల్గొన్నారు.

తాడ్వాయి: మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూతన కమిటీలను వేస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి మంథని సామెల్‌ అన్నారు. ఆదివారం తాడ్వాయి మండల నూతన అధ్యక్షుడిగా కానగండ్ల బాల సాయి లు, అధికార ప్రతినిధి ఈరమొల్ల నర్సింలు, ప్రధాన కార్యదర్శి మెట్టు చరణ్‌, సహాయ కార్యదర్శి గడ్డం రవీంద్రలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్ట వెంకట రాములు, జాతీయ నాయకులు కంతి పద్మారావు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి సట్టిగారి లక్ష్మి, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సట్టిగారి బుజ్జి, జిల్లా సీనియర్‌ నాయకులు ధ్యామని భూపతి, బి తిమోతి, రాజలింగం, లెగ్గేల రాజు, పోచయ్య, అశోక్‌, బక్కరాజు, తదితరులు పాల్గొన్నారు.

బోధన్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఉషు క్రీడా పోటీల్లో అమ్దాపూర్‌ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. అండర్‌–17 విభాగంలో తడపు అఖిల్‌, శివమ్‌, మీనాక్షి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. వీరు రాష్ట్ర స్థాయి ఉషు పోటీలకు ఎంపిక కావడంపై ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. సింధూబాయి, గంగోత్రి వెండి పతకాలు సాధించగా, సునీత, మౌనిక, శాలీంరాజ్‌ కాంస్య పతకాలు సాధించారు. పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎం సూర్యకుమార్‌, పీడీ సునీత, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement