క్షణికావేశంలో ప్రాణాలు బలి | - | Sakshi
Sakshi News home page

క్షణికావేశంలో ప్రాణాలు బలి

Sep 28 2026 1:17 AM | Updated on Sep 28 2026 1:17 AM

అవగాహన కల్పిస్తున్నాం

రామారెడ్డి: కుటుంబ కలహాలు.. ఆర్థిక ఇబ్బందులు.. మద్యం మత్తు.. కారణం ఏదైనా విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రామారెడ్డి మండలంలో ఆత్మహత్యల ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. చిన్నచిన్న సమస్యలకే త్రీవ నిర్ణయాలు తీసుకుంటూ కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటోంది.

రామారెడ్డి మండల పరిధిలో 2026 జనవరి నుంచి సెప్టెంబర్‌ 27 వరకు 19 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో 12 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, మద్యానికి బానిస కావడం తదితర కారణాలతో పలువురు ఈ దారుణ నిర్ణయానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఒక్కో ఘటన వెనుక ఒక్కో విషాద గాథ ఉన్నా.. కుటుంబ సభ్యులకు మాత్రం తీరని లోటు మిగులుతోంది.

మద్యమే ప్రధాన కారణంగా..

మండలంలోని పలు గ్రామాల్లో మద్యం సేవించిన అనంతరం కుటుంబ సభ్యులతో గొడవలు జరగడం, ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడటం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి తీసుకునే నిర్ణయాలు చివరకు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మద్యం వినియోగాన్ని నియంత్రించడంతో పాటు బాధిత కుటుంబాలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు.

ఆత్మహత్యల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందు కు చర్యలు తీసుకుంటున్నాం. సమస్యలు ఎదురైనప్పుడు ఆ వేశానికి లోనుకాకుండా కు టుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణులతో మాట్లాడాలి. మద్యం సేవించే అలవాటును నియంత్రించడంతో పాటు కుటుంబ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. గ్రామాల్లో ఆత్మహత్యలపై పోలీస్‌ కళా బృందాలతో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నాం. సమస్యలుంటే పోలీసులను సంప్రదించాలి

– శ్రీధర్‌గౌడ్‌, రూరల్‌ సీఐ, కామారెడ్డి

రామారెడ్డిని ముంచుతున్న

‘ఆత్మహత్య’ల మహమ్మారి!

తొమ్మిది నెలల్లో 19 మంది

బలవన్మరణం

చిన్న సమస్యలకే తీవ్ర నిర్ణయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement