క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Sep 28 2026 1:17 AM | Updated on Sep 28 2026 1:17 AM

గణేశ్‌ మండపం విప్పుతుండగా ప్రమాదం.. యువకుడి మృతి మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు నలుగురిపై కేసు నమోదు

బోధన్‌ రూరల్‌: గణేశ్‌ మండపం కోసం ఏర్పాటు చేసిన తాళ్లను తెంచేక్రమంలో ఓ యువకుడు కిందపడి మృతి చెందిన ఘటన బోధన్‌ మండలం ఖాజాపూర్‌ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. రూరల్‌ ఎస్సై రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఖాజాపూర్‌ గ్రామానికి చెందిన భాస్కర్‌(19) ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో తన స్నేహితుడితో కలిసి గణేశ్‌ మండపం కోసం ఏ ర్పాటు చేసిన కట్టెలకు కట్టిన తాళ్లను తెంచుతుండ గా ఒక్కసారిగా కిందపడిపోయాడు. తీవ్ర గాయా లు కావడంతో కుటుంబీకులు బోధన్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్‌నగర్‌ మండలం సింగీతం గ్రామానికి చెందిన వనం విఠల్‌(58) అనే వ్యక్తికి మద్యం అలవాటు ఉంది. మూడు నెలల క్రితం మద్యానికి డబ్బులు లేకపోవడంతో భార్య చంద్రకళ పుస్తెలతాడును అమ్ముకున్నాడు.అలాగే శనివారం మద్యం సే వించి ఇంటికి వచ్చిన విఠల్‌ తిరిగి మద్యానికి డబ్బు ల కోసం భార్యతో గొడవపడ్డాడు. రాత్రి గదిలో నిద్రించిన అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పిట్లం: బైక్‌ అదుపు తప్పి కిందపడ్డ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలైన ఘటన పిట్లం శివాజీ చౌక్‌ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంసాగర్‌ మండలంలోని మల్లూర్‌ గ్రామానికి చెందిన భూమేశ్‌ ఆదివారం బైక్‌పై వెళ్తుండగా పిట్లం శివాజీ చౌక్‌ సమీపంలో స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఎల్లారెడ్డి: ధాన్యం తరలిస్తున్న లారీని అడ్డగించి డ్రైవర్‌ నుంచి డబ్బులు వసూలు చేయాలని చూసిన నలుగురు విలేకరులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ వైపునకు శనివారం రాత్రి ధాన్యం లోడ్‌తో వెళ్తున్న ఓ లారీని బాన్సువాడకు చెందిన నలుగురు విలేకరులు ఎల్లారెడ్డి మండలంలోని మల్లయ్యపల్లి శివారులో అడ్డుకున్నారు. వీరు డ్రైవర్‌ నుంచి డబ్బులు వసూలు చేయాలని చూ శారు. అంతలోనే పోలీసుల పెట్రోలింగ్‌ వాహనం అక్కడికి రావడంతో వారు పరారయ్యారని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement