కామారెడ్డి అర్బన్: జిల్లా విశ్వకర్మ ఎంప్లాయీస్ అసోసియేషన్ (వేవా) కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నామని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణచార్య తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా అంజనేయచారి, ప్రధాన కార్యదర్శిగా వీరయ్యచారి, కోశాధికారిగా సీహెచ్ చక్రపాణి ఆర్య, గౌరవ అధ్యక్షుడిగా రఘునాథ్ ఆచార్య, జిల్లా ఉపాధ్యక్షుడిగా దత్తాచారి, సహాధ్యక్షుడుగా శ్రీనివాస్‌చారి ఎన్నికయ్యారన్నారు. బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడిగా సంతోష్ ఆచార్య, ప్రధాన కార్యదర్శిగా ఎ.కృష్ణాచారి, కోశాధికారిగా ఎస్.కృష్ణాచారి, గౌరవ అధ్యక్షుడిగా మోహన్ ఆచార్య ఎన్నికయ్యారని తెలిపారు.
కామారెడ్డి అర్బన్: కరీంనగర్‌లో ఆదివారం నిర్వహించిన హాఫ్ మారథాన్‌లో కామారెడ్డికి చెందిన పలువురు యువకులు పాల్గొన్నారు. కౌన్సిలర్ లక్ష్మీనారాయణతోపాటు పట్టణానికి చెందిన మహేందర్‌గౌడ్, ప్రకాశ్‌రావు హాఫ్ మారథాన్‌ను విజయవంతంగా ముగించారు. 10 కిలోమీటర్ల విభాగంలో రవిబాబు, సాయిచంద్, పండరి, అనిల్, రాజశేఖర్, అరుణ్, సంతోష్, రాజు, సాయి, కొండ చందు పాల్గొని పతకాలు పొందారు.
కామారెడ్డి అర్బన్: జిల్లాలో ఆదివారం నిర్వ హించిన ఉల్లాస్ పరీక్షలు ప్రశాంతంగా ము గిసినట్లు డీఆర్డీవో దామోదర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ అక్షరాస్యత మిషన్ ఆధ్వర్యంలో డీఆర్‌డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో చేపట్టిన అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 15,634 మంది అభ్యాసకులను పరీక్షలకు సిద్ధం చేశామని పేర్కొన్నా రు. ఇందులో ఆదివారం నిర్వహించిన పరీక్షలకు 15,556 హాజరయ్యారని తెలిపారు. పరీక్షలను ఓపెన్ స్కూల్ సొసైటీ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త రవీందర్, ఉల్లాస్ జిల్లా ఇన్‌చార్జి శుభం, అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి, మెప్మా పీడీ శ్రీధర్‌రెడ్డి పర్యవేక్షించారు.
కామారెడ్డి అర్బన్: పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా ఖోఖో సీనియర్ మహిళలు, పురుషుల జట్లను ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు భూమారెడ్డి, అతీకుల్లా, కోశాధికారి మధుసూదన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ప్రతిభ చూపినవారిని జిల్లా జట్లను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎంపిక పోటీలకు హాజరు కావాలని సూచించారు.
నిజామాబాద్ జిల్లాస్థాయి
నెట్‌బాల్ ఎంపిక పోటీలు..
నిజామాబాద్‌అర్బన్: జిల్లా స్థాయి నెట్‌బాల్ ఎంపిక పోటీలు ఈ నెల 29న తిర్మన్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించనున్నట్లు నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు తెలిపారు. సబ్ జూనియర్ వి భాగంలో (అండర్–16), జూనియర్ విభాగంలో (అండర్–19) బాలుర, బాలికల పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు పాఠశాలకు చేరుకోవాలని సూచించారు.
నిజామాబాద్ అర్బన్: క్రీడలతో స్నేహ భావం పెంపొందుతుందని జిల్లా జైలు పర్యవేక్షణ అధికారి అశోక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జైలులో సిబ్బందికి క్రికెట్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జైలర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ జైలర్ మన్మద్‌రావు, న్యాయవాదులు సుజిత్, ఇంతియాజ్, ఉదయ్ కృష్ణ, ప్రమోదు శుభమ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


