ప్రతిపాదనలు పంపాం..
● ప్రీప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు
మూడు నెలలుగా అందని వేతనాలు
● పట్టించుకోని అధికారులు
నిజాంసాగర్: ప్రభుత్వ ప్రీప్రైమరీ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, ఆయాలకు వేతనాలు అందడం లేదు. దీంతో వారు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు.
ఐదేళ్లలోపు పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరంలో ప్రీప్రైమరీ స్కూళ్లను ప్రారంభించింది. ఆయా బడుల్లో యూకేజీ, ఎల్‌కేజీ చదువులు పూర్తయ్యేలా ప్రత్యేకంగా ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకం చేపట్టింది.
జిల్లాలో 166 స్కూళ్లలో..
జిల్లాలోని మండలానికి కొన్ని స్కూళ్లను ఎంపిక చేసి ప్రీప్రైమరీ పాఠశాలలను ప్రారంభించారు. మొత్తం 166 స్కూళ్లలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఇందులో ఐదేళ్లలోపు 2,900 మంది చిన్నారులను చేర్చుకున్నారు. వీరికోసం 166 మంది టీచర్లు(ఇన్‌స్ట్రక్టర్లు), 166 మంది ఆయాలను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ. 8వేలు, ఆయాకు నెలకు రూ. 6వేల చొప్పున గౌరవ వేతనాలు ఖరారు చేశారు.
నెలలు గడుస్తున్నా..
ప్రీప్రైమరీ స్కూళ్లలో జూలై నుంచి చిన్నారులకు విద్య ను అందిస్తున్నారు. కానీ ఇప్పటికీ టీచర్లు, ఆయాలకు వేతనాలు అందకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వేతనాలు త్వరగా ఇప్పించాలని కోరుతున్నారు.
జిల్లాలోని ప్రీప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లతోపాటు ఆయాలకు గౌరవేతనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ.8 వేలు, ఆయాకు నెలకు రూ.6వేల చొప్పున వేతనాలు రావాల్సి ఉంది. త్వరలోనే వారికి వేతనాలు వస్తాయి.
– మల్లికార్జున్, డీఈవో, కామారెడ్డి


