బోధన్‌టౌన్(బోధన్): ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో నేడు కాంగ్రెస్, నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆరోపించారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బోధన్ నుంచి జగిత్యాల వరకు నిర్వహించనున్న సైకిల్ యాత్రను ఆదివారం బోధన్ పట్టణలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హా మీలను అమలు చేయాలని, రైతు సమస్యలను ప రిష్కరించాలని మూడు రోజులపాటు పార్లమెంట్ పరిధిలో సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నామన్నా రు. రాష్ట్రంలో నీటిపారుదల రంగాలను మాజీ సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేసి కుటుంబానికి దోచిపెట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కుటుంబ ప్రాధాన్యత పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మో సం చేశారన్నారు.
భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయ మని, రానున్నది బీజేపీ ప్రభుత్వమని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, పసుపు బోర్డు జాతీయ అ ధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, బోధన్ నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డి మోహన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను
భూస్థాపితం చేయాలి
రానున్నది
బీజేపీ ప్రభుత్వమే
ఎంపీ అర్వింద్ ధర్మపురి
బీజేపీ కిసాన్ మోర్చా
సైకిల్ యాత్ర ప్రారంభం


