వెలగని హైమాస్ట్‌ లైట్లు | - | Sakshi
Sakshi News home page

వెలగని హైమాస్ట్‌ లైట్లు

Sep 26 2026 1:08 AM | Updated on Sep 26 2026 1:08 AM

కామారెడ్డి రూరల్‌: మున్సిపల్‌ పరిధిలోని దేవునిపల్లి ప్రాంతం దేవి విహార్‌ 3 ఫేజ్‌ వద్ద హైమాస్ట్‌ లైట్లు వెలగడం లేదు. దీంతో కాలనీ అంధకారంలో మగ్గుతోంది. గతేడాది కురిసిన భారీ వర్షానికి డివైడర్లు కొట్టుకుపోయాయి. దీంతో కాలనీలోని 3వ ఫేజ్‌ నుంచి ఉన్న నాలుగు హైమాస్ట్‌ లైట్ల కనెక్షన్‌ వైర్లు ఉడిపోయాయి. నాటి నుంచి నేటి వరకు వాటికి మరమ్మతులు చేయకపోవడంతో లైట్లు వెలగక చీకటి నెలకొంటోంది. లైట్లు లేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కాలనీవాసులు పేర్కొంటున్నారు. ఇకనైనా మున్సిపల్‌ అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో లైట్ల సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement