కామారెడ్డి టౌన్: వైద్యరంగంలో ఫార్మసిస్టుల పాత్ర అత్యంత కీలకమని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పీ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి వెంకటి హాజరై కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో టీజీపీవోఏ జిల్లా అధ్యక్షుడు ఎన్ లింగయ్య, వైద్యులు, ఫార్మసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


